: సరిహద్దులో సయీద్... భారత్ పై దాడులకు తెగబడాలని ‘ఉగ్ర’ బోధన
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్-పాకిస్థాన్ సరిహద్దులో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్ భూభాగం కేంద్రంగా పురుడుపోసుకుని భారత్ లో దాడులకు పన్నాగాలు పన్నుతున్న ఉగ్రవాదులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా అతడు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నాడట. పాక్ భద్రతా దళాల దన్నుతోనే అతడు సరిహద్దు వెంట సంచరిస్తున్నాడట. 'భారత్ లో విరివిగా దాడులకు పాల్పడండి' అంటూ సయీద్ చేస్తున్న ఉద్బోధ కారణంగానే ఇటీవల భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఆరోపిస్తోంది. పాక్ లోని సియాల్ కోట్ సమీపంలోని సరిహద్దు వద్ద అతడు ఉగ్రవాదులను ఉద్దేశించి ప్రసంగించినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ రాకేశ్ శర్మ్ మీడియాకు చెప్పారు.