: వీరభద్రుడికి ఈడీ నోటీసులు... హిమాచల్ సీఎం అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ పలుమార్లు వీరభద్ర సింగ్ ఇళ్లలో సోదాలు చేసింది. అంతేకాక, ఆయన అరెస్ట్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అడ్డుకుంటోందని ఆరోపించిన సీబీఐ, కేసు విచారణను ఏకంగా ఢిల్లీ హైకోర్టుకు బదలాయించుకుంది. తాజాగా వీరభద్ర సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది.