: ఐఎస్ఐఎస్ వెబ్ సైట్ స్థానంలో వయాగ్రా యాడ్!


గుర్తు తెలియని టెక్కీలు ఐఎస్ఐఎస్ ప్రధాన వెబ్ సైట్లలో ఒకదాన్ని హ్యాక్ చేసి అందులో వయాగ్రా మాత్రల ప్రకటనలు ఉంచారు. "ఈ యాడ్ చూసి మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి. మేము మా మౌలిక వసతులను మరింతగా పెంచుకుని ఐఎస్ఐఎస్ చెప్పాలనుకున్నదాన్ని ఇంకా గట్టిగా చెబుతాం" అంటూ ఆ పేజీలో వ్యాఖ్యానిస్తూ, 'టూ మచ్ ఐఎస్ఐఎస్' అని టైటిల్ ఉంచారు.. ఓ ఆన్ లైన్ ఫార్మసీ యాడ్ ను ఈ పేజీలో చేర్చారు. మిగతా ఉగ్రవాదులకు చెందిన సమాచారాన్ని చెరిపేశారు. కాగా, ఇప్పటికే పలు ఐఎస్ఐఎస్ వెబ్ సైట్లు హ్యాకింగుకు గురికాగా, మరెన్నో సైట్లు, 'డార్క్ వెబ్'లోకి తరలిపోయాయి.

  • Loading...

More Telugu News