: పొద్దున్నే పతనం మొదలు...మరో వికెట్ డౌన్!
గింగిరాలు తిరుగుతూ వస్తున్న బంతులను అడ్డుకోవడంలో ఇబ్బందులు పడుతున్న దక్షిణాఫ్రికా జట్టుపై మూడో రోజు ప్రారంభంలోనే దెబ్బపడింది. 2 వికెట్ల నష్టానికి 32 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన జట్టు మరో 18 పరుగులు జోడించగానే ఎల్గర్ వికెట్ ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారాకు క్యాచ్ ఇచ్చిన ఎల్గర్, పెవీలియన్ దారి పట్టాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు మరో 270 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఇక భారత్ గెలవాలంటే, 7 వికెట్లు తీయాల్సి వుంది. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా 3, డివిలియర్స్ 0 పరుగులతో ఉండగా, దక్షిణాఫ్రికా స్కోరు 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు.