: రూ.900 కోట్లను దేశం దాటించిన ముఖర్జియా దంపతులు... ఇంటర్ పోల్ సహకారం కోరిన సీబీఐ


వావి వరసలు లేని సంబంధాలు, పరిమితులు లేని జీవన విధానం నేపథ్యంలో జరిగిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ కొత్త కోణాన్ని వెలికి తీసింది. షీనా హత్య వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఇమిడి ఉన్నాయని భావిస్తున్న సీబీఐ అధికారులు కేసులో కీలక నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియా విచారణ సందర్భంగా ఈ విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. విచారణలో తమకు సరిగా సహకరించని పీటర్ ను మరిన్ని రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయన కస్టడీని ఈ నెల 30 దాకా పొడిగించింది. 9ఎక్స్ మీడియాలో వాటాలున్న పీటర్, ఇంద్రాణీలు ఆ కంపెనీకి చెందిన దాదాపు రూ.900 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరిలించారట. స్విస్ బ్యాంకు సహా ఇతర దేశాల్లోని పలు బ్యాంకుల్లో పదుల సంఖ్యలో ఖాతాలు తెరచిన ఆ దంపతులు ఇందుకోసం షీనా బోరా పేరిట కూడా ఖాతా తెరిచారని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు నిజా నిజాలను నిగ్గు తేల్చేందుకు సదరు బ్యాంకు ఖాతాలను పరిశీలించే విషయంలో సహకరించాలని ఇంటర్ పోల్ ను సీబీఐ కోరింది.

  • Loading...

More Telugu News