: సఫారీలకు 278 రన్స్ కావాలి... కోహ్లీ సేనకు మాత్రం 8 వికెట్లు చాలు!


మూడో టెస్టు...మూడో రోజే ముగిసిపోతుంది. క్రికెట్ ఫ్యాన్స్ లో ఈ అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఇప్పటికే రెండు ఇన్నింగ్స్ లు ఆడేసిన టీమిండియా 278 పరుగుల ఆధిక్యంలో ఉంది. వికెట్ల పతనం కొనసాగుతున్న ఈ మ్యాచ్ లో ఈ స్కోరున్న జట్టు సురక్షిత స్థితిలో ఉన్నట్లే. మరోవైపు 79 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో చతికిలబడ్డ సఫారీలు, రెండో ఇన్నింగ్స్ లో 32 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. నేటి ఆటలో భాగంగా మరో 278 పరుగులు చేస్తే కాని ఆ జట్టుకు విజయం దరి చేరదు. అయితే స్పిన్ మాయాజాలంతో క్షణాల్లో మ్యాచ్ ను ముగిస్తున్న టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల బౌలింగ్ ను ఎదుర్కొని ఆ మేర స్కోరు సాధించడం దుర్లభంగానే కనిపిస్తోంది. వెరసి విజయం కోసం సఫారీ జట్టుకు 278 పరుగులు కావాల్సి ఉండగా, టీమిండియాకు మాత్రం 8 వికెట్లు పడితే సరిపోతుంది. ఏం జరుగుతుందో మరో రెండు, మూడు గంటల్లోనే తేలిపోనుంది.

  • Loading...

More Telugu News