: వైట్ హౌస్ గోడ దూకిన గుర్తు తెలియని వ్యక్తి


అసలే ఉగ్రవాదుల దాడులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి. అదే ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పై దాడి జరిగితే... ఇంకేమైనా ఉందా? దాదాపుగా అదే జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే వైట్ హౌస్ గోడ దూకి లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో ఒబామా, తన కుటుంబంతో కలసి భవనంలోనే ఉన్నారు. అంతే, భద్రతా అధికారుల గుండెల్లో బాంబులు పేలాయి. ఒబామాను, ఆయన భార్యాబిడ్డలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోడదూకిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, అతని పేరు జోసెఫ్ క్యాపుటో అని, గతంలో నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడని, వైట్ హౌస్ గోడ ఎందుకు దూకాడో తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో వైట్ హౌస్ గోడలు దూకుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం అధికారుల్లో ఆందోళనను పెంచుతోంది.

  • Loading...

More Telugu News