: మా అమ్మానాన్న 'ది బెస్ట్ పేరెంట్స్ ఇన్ ది వరల్డ్'... రకుల్ ప్రీత్ సింగ్
తన తల్లిదండ్రులు ‘ది బెస్ట్ పేరెంట్స్ ఇన్ ది వరల్డ్’ అంటూ అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేసింది. వివాహ బంధం ఎంతో మధురమైందని, వారి బంధం కలకాలం కొనసాగాలని ఆ ట్వీట్ లో పేర్కొంది.