: లేఖాస్త్రంతో అనుష్క 'సైజ్ జీరో' ప్రచారం
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క తాజా సినిమా 'సైజ్ జీరో' కోసం వినూత్న ప్రచారానికి తెరతీసింది. ఫేస్ బుక్ ద్వారా అభిమానులను సినిమా చూడాలని ఆహ్వానించింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, ఆ కష్టం కూడా చాలా ఇష్టంగా పడ్డానని, ఎంతో కష్టపడి బరువు పెరిగానని అనుష్క చెప్పింది. ఈ సినిమాలో తన తల్లికి, తనకు మధ్య విశేషమైన ప్రేమ ఉంటుందని, తన చుట్టూ ఉన్నవారు ఫేస్ చేసిన సమస్యలే ఈ సినిమా కథాంశమని చెప్పింది. ఇది కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అని, 'మీరే నా కుటుంబం కనుక అంతా వచ్చి సినిమా చూడండి' అంటూ ఓ లేఖ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. మరి అనుష్క ప్రచార లేఖకు ఎంతటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేజీ బంగారం పోటీని ప్రకటించారు.