: అమీర్ ఎలా ఫీలయ్యారో అదే చెప్పారు: మమతా బెనర్జీ


అమీర్ ఖాన్ ఎలా ఫీలయ్యారో అదే చెప్పారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, దేశంలో అందరికీ మాట్లాడే హక్కు ఉందని అన్నారు. అమీర్ ఖాన్ కు తన భావాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి భావాలు వారు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని ఆమె తెలిపారు. దేశం విడిచి వెళ్లమనే అధికారం ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదీనని ఆమె అన్నారు. కాగా, అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News