: ఇతర భారతీయ భాషలన్నింటికీ అధికార హోదా కల్పించాలి: ఏఐఏడీఎంకే డిమాండ్
భారతీయ భాషలన్నింటికీ అధికార హోదా కల్పించాలని పార్లమెంట్ లో ఏఐఏడీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించాలంటే, అందరికీ సమాన అవకాశాలు కావాలని ఆ పార్టీ సభ్యుడు తంబిదురై అన్నారు. లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడిన అనంతరం తంబిదురై ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలను, భాషలను సమ భావంతోనే చూడాలని అన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి అయినా సరే, ఇతర భారతీయ భాషలన్నింటికి అధికార హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఇక్కడ నేను తమిళ భాషలో మాట్లాడాలంటే అనువాదకులు వస్తారు. కానీ, పూర్తి స్థాయిలో వెంటనే అనువాదం చేయలేరు. అందుకే, ఇతర భారతీయ భాషలన్నింటికి అధికార హోదా కల్పించాలి’ అని తంబిదురై అన్నారు.