: అమీర్ ఖాన్ కుటుంబానికి పాకిస్థాన్ వెళ్లడానికి టికెట్లు బుక్ చేసిన హిందూ సేన
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై విమర్శల జడివాన ఇంకా తగ్గడం లేదు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు అమీర్ ఖాన్ కుటుంబం పాకిస్థాన్ కు వెళ్లేందుకు హిందూ సేన టికెట్లు బుక్ చేసినట్టు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ట్వీట్ తో పాటు ఆ టికెట్లను కూడా పోస్టు చేశారు. ఈ టికెట్లు అమీర్ ఖాన్, కిరణ్ రావు ఖాన్, ఆజాద్ రావు ఖాన్ ల పేరు మీద బుక్ అయినట్టు ఉన్నాయి. అయితే ఈ టికెట్లు ఎవరు తీశారు? అనే విషయం వెల్లడించలేదు. కాగా, ఆన్ లైన్ లో బుక్ చేసిన టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉండడం విశేషం.