: సొరంగాలలో రక్షణ ఏర్పాట్లు చేసుకున్న ఐఎస్ఐఎస్!
సిరియా, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఐఎస్ఐఎస్ పాగా వేసిన విషయం అందరికీ తెలిసిందే. తన చర్యల కారణంగా ప్రపంచ దేశాలు తనపై బాంబులతో విరుచుకుపడతాయని ముందుగానే ఊహించిన ఐఎస్ఐఎస్ వాటి నుంచి రక్షణ పొందే భద్రతా చర్యలను ముందుగానే చేపట్టింది. భూ ఉపరితలం నుంచి దాడులు చేస్తే ప్రపంచ దేశాలు జరిపే బాంబు దాడులకు పతనమవ్వాల్సిందేనని భావించిన ఐఎస్ఐఎస్ భూగర్భ సొరంగాలను సిద్ధం చేసుకుంది. సొరంగాల్లో ఉంటూ భూ ఉపరితలంపైకి వచ్చి దాడులు చేసేందుకు అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంది. ఆ సొరంగాల్లో విద్యుత్ సౌకర్యం, హాయిగా పడుకునేందుకు వెసులుబాట్లు ఉన్నాయి. ఆ సొరంగాల్లో వాళ్లు పడుకునే చోట పక్కనే యాజీదీల సమాధులను గుర్తించినట్టు ఇరాకీ కుర్షిద్ యోధులకు చెందినా కమాండర్ శ్యామో ఎయాదో వెల్లడించారు. ఈ సొరంగాలు వంద మీటర్ల దూరం ఉన్నట్టు ఆయన చెప్పారు.