: నేను కూడా అసహనంలో ఉన్నాను...కిరణ్ రావును అభినందించిన జైపాల్ రెడ్డి


బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావును మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అభినందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను కూడా గత కొంత కాలంగా తీవ్ర అసహనంతో ఉన్నట్టు చెప్పారు. తన అసహనంపై భర్తకు చెప్పిన కిరణ్ రావు అభినందనీయురాలని అన్నారు. ఈ విషయంలో అమీర్ ఖాన్ ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమీర్ ఖాన్ దేశ భక్తిని ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అమీర్ ఖాన్ ఎన్నో దేశభక్తి కలిగిన సినిమాలలో నటించి తానేంటో నిరూపించుకున్నాడని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎవరైనా అలా అభిప్రాయపడడం సహజమేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News