: డిసెంబర్ 15 నుంచి దాయాదుల పోరు?
పాకిస్థాన్-భారత జట్ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా తెలిపారు. పలు ఆందోళనలు, అనుమానాలు, చర్చలు, సమావేశాల అనంతరం శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. దీనిపై పీసీబీ ఆ దేశాక్షుడు నవాజ్ షరీఫ్ నుంచి అనుమతి పొందడం కూడా పూర్తైందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే సిరీస్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వచ్చే నెల 15 నుంచి సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీనికి సన్నాహాలు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.