: జర్మన్ ల మనసు దోచుకున్న సిరియా శరణార్థి
సిరియా నుంచి పొట్ట చేతబట్టుకుని సరిహద్దులు దాటి వచ్చిన తమను ఆదుకున్న దేశానికి కృతజ్ఞత తెలుపుకునేందుకు ఓ శరణార్థి చేసిన సాయం ఆందరిచేతా ప్రశంసలు కురిపిస్తోంది. అలెక్సా అస్సాలీ సిరియాలో నెలకొన్న అశాంతితో విసిగి వేసారిపోయాడు. బ్రతకడం దుర్భరంగా మారడంతో ఆ దేశంలో ఉండలేక, సరిహద్దులు దాటి జర్మనీ వలస వెళ్లిపోయాడు. అప్పుడు జర్మనీ స్వాగతం పలికింది. ఆశ్రయం ఇచ్చింది. హమ్మయ్య అని ఆశ్రయం దొరికిందని విశ్రాంతి తీసుకోకుండా, వారంలో ఐదు రోజులు పని చేసి, అలా సంపాదించిన దానితో వారంతంలో బెర్లిన్ లోని అలెగ్జాండ్రా ప్లాట్స్ స్టేషన్ వద్ద నిరాశ్రయులకు వేడివేడి ఆహారం వండి పంచిపెడుతున్నాడు. ఈయన చేసిన పనిని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అంతా ఆయనను అభినందిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 27 లక్షల మంది వీక్షించడం విశేషం.