: రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసిన సఫారీలు


టీమిండియా స్పిన్ పిచ్ ల వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. వన్డే, టీట్వంటీ సిరీస్ లను బ్యాటింగ్ పిచ్ లపై అలవోకగా గెలుచుకున్న సౌతాఫ్రికా జట్టు టీమిండియా స్పిన్ వ్యూహంలో చిక్కుకుని గిలగిల్లాడుతోంది. స్పిన్ మంత్రంతో తొలి టెస్టును మూడు రోజుల్లో ముగించిన భారత జట్టు, మూడో టెస్టును కూడా మూడు రోజుల్లో ముగించేలా కనిపిస్తోంది. తొలి రోజు పూర్తి అధిక్యం చూపిన భారత జట్టు రెండో రోజు చతికిల పడింది. తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులు చేసి రాణించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 173 పరుగులు సాధించింది. సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 79 పరుగులు మాత్రమే చేయగా, రెండో ఇన్నింగ్స్ లో వాన్ జిల్ (5), ఇమ్రాన్ తాహిర్ (8) ల వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 32 పరుగులు చేసింది. పది పరుగులతో ఎల్గర్, మూడు పరుగులతో ఆమ్లా క్రీజులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా జట్టు భారత్ కంటే 278 పరుగులు వెనుకబడి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సఫారీ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News