: విభజనపై ఎవర్నీ దూషించాల్సిన పని లేదు: జితేందర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై ఎవర్నీ దూషించాల్సిన పని లేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో ఏకపక్ష విభజన కారణంగా తమ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, పెద్దన్న పాత్ర పోషించాల్సిన యూపీఏ, అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్రాన్ని ఏకపక్షంగా ముక్కలు చేసిందని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ, విభజన సహేతుకమైనదేనని అన్నారు. అందుకు నిదర్శనం వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి లభించిన మెజారిటీయేనని చెప్పారు. పైసా ఖర్చు చేయకున్నా తమ పార్టీ అభ్యర్థికి అఖండ మెజారిటీ కట్టబెట్టారని ఆయన తెలిపారు.