: తిరుపతి విమానాశ్రయ మేనేజర్ ను కొట్టిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి?


తిరుపతి విమానాశ్రయ మేనేజర్ పై వైకాపా నేత, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి దాడి చేసి కొట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయానికి వచ్చిన మిధున్ రెడ్డి, తనకు బోర్డింగ్ పాస్ ఇచ్చే విషయమై అధికారులతో గొడవపడగా, అడ్డుకోబోయిన మేనేజర్ పై మిధున్ చెయ్యి చేసుకున్నట్టు సమాచారం. సమయం దాటిన తరువాత వచ్చిన వైకాపా నేతలకు బోర్డింగ్ పాసులు ఇచ్చేందుకు ఎయిర్ లైన్స్ అధికారులు నిరాకరించడంతో గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. వైకాపా నాయకులు, అధికారుల మధ్య వివాదం పెరుగగా, ఆ పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇతర నాయకులు ఒక్కసారిగా ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్లి రభస సృష్టించినట్టు సమాచారం. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News