: రాజ్యాంగ నిర్మాణంలో వీసమెత్తు పాత్రలేని వారు నేడు గొంతు చించుకుంటున్నారు: బీజేపీపై సోనియా నిప్పులు


భారత రాజ్యాంగ నిర్మాణం వెనుక వీసమెత్తు పాత్ర కూడా పోషించని పార్టీలు ఇవాళ రాజ్యాంగం గురించి లౌకికవాదం గురించి మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. నేడు పార్లమెంటులో ప్రసంగించిన ఆమె, రాజ్యాంగ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే భాగం పంచుకుందని, ఆనాడు కంటికి కూడా కనబడని పార్టీలు నేడు రాజ్యాంగంలోని అంశాలను వివాదాస్పదం చేయాలని చూస్తూ గొంతు చించుకుంటున్నాయని, భారత రాజ్యాంగానికి ఇంతకన్నా అవహేళన మరొకటి ఉండదని అన్నారు. రాజ్యాంగంపై చర్చ జరుగుతుండటం సంతోషకరమైన అంశమే అయినప్పటికీ, రాజ్యాంగంలోని ఏ సిద్ధాంతాలు, నిబంధనలతో ప్రేరేపితమయ్యామో వాటిని దూరం చేసేందుకు దాడి జరుగుతుండటం బాధను కలిగిస్తోందని సోనియా అన్నారు. కొద్ది రోజుల నుంచి ఇండియాలో జరుగుతున్న ఘటనలు రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమని, ప్రభుత్వం స్వయంగా దాన్ని వెనకేసుకు వస్తుండటం అత్యంత ఘోరమని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News