: ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల
ఇసుక విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఇసుక అమ్మకం ద్వారా రూ.821.21 కోట్ల ఆదాయం వచ్చిందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. 2015 నవంబర్ నాటికి రాష్ట్రంలో మొత్తం 387 ఇసుక రీచ్ లు నమోదైనట్లు తెలిపారు. 2 కోట్ల 82 లక్షల 8 వేల 132 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీశామని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కోటి 37 లక్షల 89 వేల మందికి ఇసుక విక్రయాలు జరిగాయని స్పష్టం చేసింది. 4,023 స్వయం సహాయక సంఘాలు ఇసుక రీచ్ లను నిర్వహించాయని పేర్కొంది. ఇసుక విక్రయాల ద్వారా తూర్పుగోదావరి జిల్లా నుంచి రూ.143 కోట్ల ఆదాయం రాగా, ప్రకాశం జిల్లా నుంచి అత్యల్పంగా రూ.12.79 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.