: ముతాలిక్ కు బెదిరింపులు వచ్చాయట!... జడిసేది లేదంటున్న శ్రీరామ్ సేన నేత


ప్రమోద్ ముతాలిక్ గుర్తున్నారా?.. గుర్తు లేకపోతే, 2009 రికార్డులను తిరగేయాల్సిందే. 2009లో కర్ణాటకలోని మంగళూరులోని ఓ పబ్ లో అసభ్యకర సన్నివేశాల్లో మునిగిపోయారంటూ మహిళలపై శ్రీరామ్ సేన దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఒక్క ఘటనతో శ్రీరామ్ సేన నేతగా ముతాలిక్ పేరు మారుమోగిపోయింది. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ఆయన పలు రెచ్చగొట్టే ప్రసంగాలూ చేశారు. ‘‘అత్యాచారానికి పాల్పడ్డ వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేం భరిస్తాం’’ అని ప్రకటించి మరింత సంచలనం రేపారు. ఇక అసలు విషయంలోకి వస్తే... హిందూ వ్యతిరేకులకు సింహస్వప్నంలా మారిన ప్రమోద్ ముతాలిక్ కు తాజాగా బెదిరింపులు ఎదురయ్యాయట. మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపైనే కాక, ఇస్లాం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముతాలిక్ కు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని నేటి ఉదయం ఆయనే స్వయంగా హుబ్లీలో వెల్లడించారు. అయితే ఈ తరహా బెదిరింపులకు జడిసేది లేదని, హిందూ మత పరిరక్షణ కోసం పనిచేయకుండా తనను ఎవరూ ఆపలేరని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News