: ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త, వేతన పెంపు, ఐదు పనిదినాలు
భారత జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ (లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తమ ఉద్యోగులకు బంపర్ బొనాంజాను ప్రకటించింది. 15 శాతం వేతన పెంపుతో పాటు బ్యాంకుల తరహాలోనే నెలలోని రెండు వారాల్లో ఐదు పనిదినాల విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఎల్ఐసీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాగా, వేతన పెంపును ఆగస్టు 2012 నుంచి అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పెరిగే 15 శాతం వేతనంలో 13.5 శాతం బేసిక్ పే పెంపు రూపంలో, 1.5 శాతం హెచ్ఆర్ఏ రూపంలో ఉద్యోగులకు అందుతాయని ఎల్ఐసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ముసాయిదాను తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని, అక్కడి నుంచి న్యాయ శాఖ అనుమతి నిమిత్తం వెళ్తాయని వివరించారు.