: ప్రజలకు ఆయుధాలిస్తున్న అమెరికా...వెంటాడుతున్న ఐఎస్ఐఎస్ భయం!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడకుండా చూసేందుకు అమెరికా మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. మెక్సికో నుంచి వలసలను నివారించేందుకు సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి వారినే కాపలాగా ఉంచుతోంది. పారిస్ తో దాడుల తరువాత ప్రజలకు ఇస్తున్న ఆయుధాల సంఖ్యను ఒబామా సర్కారు మరింతగా పెంచగా, ఇప్పటికే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. "సోమాలీలు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన వారు ఎంతో మంది చట్టవిరుద్ధంగా మెక్సికో, యూఎస్ మధ్య సరిహద్దులు దాటి వచ్చేశారు. పారిస్ తరహా దాడులు అమెరికాలోనూ జరగవచ్చు" అని ఆయుధం ధరించి కాపలా కాస్తున్న టిమ్ నైలర్ ఫోలే వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తాను నిర్మాణ రంగంలో కూలీగా పనిచేశానని, ఇప్పుడిలా కాపలా కాస్తున్నానని వివరించారు. "మా దేశ ప్రజలు త్వరగా మేల్కొనాలి. ఈ సరిహద్దులు అంత సురక్షితం కాదు. ఇక్కడి నుంచి సులువుగా అమెరికాలోకి ప్రవేశించవచ్చు" అని 56 ఏళ్ల రెకాన్ వ్యాఖ్యానించారు. వలస వస్తున్నామంటూ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిలో ఉగ్రవాదులు తప్పక ఉంటారని, వారివల్ల ఏనాటికైనా ప్రమాదమేనని ఎఫ్బీఐ సైతం అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే.