: అమ్మాయిల సమాధానంతో బిత్తరపోయిన రాహుల్!


‘స్వచ్ఛ భారత్ పథకం విజయవంతమైందా?’ అని ప్రశ్నించగా... ‘ఎస్’ అనే సమాధానంతో ఆడిటోరియం మార్మోగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిత్తరపోవడమే కాదు బిక్క మొహం వేశారు. ఈ సంఘటన బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మెల్ కళాశాలలో జరిగింది. విద్యార్థినులతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో రాహుల్ కు ఈ అనుభవం ఎదురైంది. తన ప్రసంగం మధ్యలో రాహుల్ ఈ ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది విద్యార్థినులు ‘ఎస్’ అని సమాధానం చెప్పారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పై ఆయన వేరే ఆరోపణలు చేశారు. ఎన్ డీఏ సర్కార్ లో కేవలం ఒకే ఒక వ్యక్తి అన్నింటినీ నిర్ణయిస్తున్నారని, కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా భారత్ అభివృద్ధి పథంలో నడవదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ తరచుగా చేసే విమర్శ సూట్-బూట్ సర్కార్. ఈ సందర్భంగా ఆయన మళ్లీ ఇదే విమర్శ చేశారు.

  • Loading...

More Telugu News