: నిధులివ్వని చంద్రబాబు అధికారులను తిడుతున్నాడు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు నిధులివ్వని చంద్రబాబు, అధికారులపై మండిపడుతున్నారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో వరద బాధితులను జగన్ పరామర్శించారు. వరద బాధితులకు సాయమందడం లేదని, తక్షణ సాయం కింద ఒక్కొక్క కుటుంబానికి కనీసం రూ.5000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయని జగన్ పేర్కొన్నారు.