: మీడియా క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకీడుస్తా: మహిళా పైలట్


జమ్మూకాశ్మీర్ లోని కత్రాలో ఓ హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరగగానే భారతీయ మీడియా మహిళా పైలట్ సుమిత్రా విజయన్ మృతి చెందారని పేర్కొంటూ ఓ ఫోటోతో వార్తను ప్రసారం చేసింది. అయితే మృతి చెందిన పైలట్, మీడియాలో ప్రదర్శితమైన మహిళ ఒకరు కాదు. కానీ ఇద్దరి పేర్లూ ఒకటే. దీంతో మీడియా పొరపాటు పడింది. ఆమె ఫోటో చూసిన బంధువులు ఆందోళనతో ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. పరామర్శించడం మొదలు పెట్టారు. దీంతో అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆమెకు అసలు ఏం జరిగిందో తెలియక, ఏం చెప్పాలో అర్థం కాక తికమకపడ్డారు. వారినే విషయం అడిగి తెలుసుకున్నారు. దీంతో భారతీయ మీడియా క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకీడుస్తానని హెచ్చరించారు. తాను ముంబైలో పెరిగి గత 15 ఏళ్లుగా దుబాయ్ లో సంతోషంగా ఉంటున్నానని ఆమె చెప్పారు. మీడియా తనను ఆందోళనకు గురి చేసిందని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News