: బురఖా ధరిస్తే ఆరున్నర వేల నుంచి ఆరున్నర లక్షల వరకు జరిమానా?


స్విట్జర్లాండులోని టిసినో రాష్ట్రంలో బురఖా ధరించడం నేరం. అక్కడ బురఖా ధరిస్తే ఆరున్నర వేల రూపాయల నుంచి ఆరున్నర లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. 2013 సెప్టెంబర్ లో బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బురఖా ధరించడంపై రెఫరెండం జరిగింది. ఈ రెఫరెండంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బురఖా ధరించడానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బురఖాలను నిషేధిస్తూ చట్టం చేశారు. బురఖాలను నిషేధించడం ఫెడరల్ చట్టానికి వ్యతిరేకం కాదని అక్కడి కేంద్రం వెల్లడించింది. బురఖా ముసుగులో టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News