: పారిస్ దాడులకు కారణమైన నా సోదరుడిని వెంటనే అరెస్టు చేయండి: ఉగ్రవాది సోదరుడి విజ్ఞప్తి
ఫ్రాన్స్ రాజధాని పారిస్ దాడులకు కారణమైన తన సోదరుడిని తక్షణం అరెస్టు చేయాలని మహ్మద్ అబ్దెస్లామ్ డిమాండ్ చేశాడు. తన ఇద్దరు సోదరులు చేసిన పని వల్ల తమ కుటుంబం మొత్తం తలెత్తుకోలేకుండా ఉందని మహ్మద్ అబ్దెస్లామ్ తెలిపాడు. దాడులకు కొన్ని రోజుల ముందు తన ఇద్దరు సోదరులను చూశానని మహ్మద్ వెల్లడించాడు. పారిస్ దాడుల బాధితుల ఆవేదన తనకు తెలుసని మహ్మద్ పేర్కొన్నాడు. తాము కూడా చాలా బాధపడుతున్నామని ఆయన తెలిపాడు. పారిస్ మారణహోమానికి మహ్మద్ అబ్దెస్లామ్ సోదరులు బ్రహీమ్ అబ్దెస్లామ్, సాలాహా అబ్దెస్లామ్ కారకులు. ఫ్రాన్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బ్రహీమ్ అబ్దెస్లామ్ హతమవ్వగా, సాలాహా అబ్దెస్లామ్ పరారయ్యాడు. సాలాహాను తక్షణం అరెస్టు చేయాలని మహ్మద్ కోరాడు.