: నా దేశాన్ని ప్రేమిస్తున్నా...నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: అమీర్ ఖాన్
'నేను భారతీయుడిని, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా'నని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. మత అసహనం వ్యాఖ్యలపై ముంబైలో వివరణ ఇస్తూ, భారతీయుడినైనందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పాడు. తన ఇంటర్వ్యూ చూడని వారే తనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపాడు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. తన దేశ భక్తికి ఎవరి కితాబు అక్కర్లేదని అమీర్ చెప్పాడు. తాను అచ్చమైన భారతీయుడినని, దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని అమీర్ మరోసారి చెప్పాడు. భారత గడ్డపై జన్మించడం తన అదృష్టమని అమీర్ ఖాన్ తెలిపాడు. తనకు కానీ, తన భార్యకు కానీ దేశం విడిచి వెళ్లాలన్న ఆలోచన లేదని అమీర్ ఖాన్ వివరించాడు.