: సెంచరీతో అదరగొట్టిన జూనియర్ లిటిల్ మాస్టర్
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కెరీర్ లో మరో సెంచరీ నమోదు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న పయ్యాడే అండర్-16 క్రికెట్ టోర్నీలో సెంచరీతో రాణించి సత్తా చాటాడు. సునీల్ గవాస్కర్ ఎలెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ రోహిత్ శర్మ ఎలెవెన్ జట్టుపై 156 బంతుల్లో రెండు సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. అర్జున్ రాణించడంతో సునీల్ గవాస్కర్ ఎలెవెన్ జట్టు 218 పరుగులు చేసింది. ధీరూభాయ్ అంబానీ అండర్-16 టోర్నీలో అర్జున్ 42 బంతుల్లో 118 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.