: రాష్ట్ర అభివృద్ధిపై నాకు స్పష్టత ఉంది: సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై తనకు స్పష్టత ఉందని, కేంద్రం సహకారం తీసుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని అనంతవరంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, చెట్లుండే చోటే ఆరోగ్యం... నీరుండే చోటే నాగరికత ఉంటాయన్నారు. ప్రస్తుతం పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయన్నారు. అధిక వర్షాలు, అనావృష్టి, తుపానులు దెబ్బతీస్తున్నాయన్నారు. ప్రతిఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు తప్పకుండా నాటాలని సూచించారు. పాఠశాలలో గ్రీన్ కోర్టు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు అందులో సభ్యులు కావాలని సూచించారు. హరిత అమరావతి ఉద్యమానికి అందరూ కలిసి రావాలని పిలుపు నిచ్చారు. మొక్కల సంరక్షణను ఉద్యమంగా తీసుకోవాలన్నారు. అందుకుగాను ఐదారేళ్లలో మొక్కల సంరక్షణ ఉద్యమం చేపడతామన్నారు. ప్రతి ఏటా 50 కోట్ల మొక్కల పెంపకమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి ఏటా జులై 1 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News