: చిత్తూరు ప్రైవేట్ పాఠశాలలో గోడ కూలి విద్యార్థి దుర్మరణం!


చిత్తూరు జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఘోరం జరిగింది. గుర్రంకొండలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ గోడ కూలడంతో ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

  • Loading...

More Telugu News