: ఈ పుస్తకాన్ని వాళ్లందరికీ అంకితమిస్తున్నా: రాంగోపాల్ వర్మ
'గన్స్ అండ్ థైస్' పేరుతో రాస్తున్న తన ఆత్మకథ పుస్తకాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ పలువురు స్టార్ నటులకు అంకితమిచ్చాడు. అయాన్ రాండ్, బ్రూస్ లీ, ఉర్మిళా మంటోండ్కర్, అమితాబ్ బచ్చన్, పోర్న్ స్టార్ టోరి బ్లాక్, మరికొంతమంది గ్యాంగ్ స్టర్లకు అంకితం చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తాను జీవితంలో పైకి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వీరంతా తోడ్పడ్డారని చెప్పాడు. రూపా పబ్లికేషన్స్ ప్రచురిస్తున్న ఈ పుస్తకాన్ని డిసెంబర్ లో మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఇటీవల పుస్తకం కవర్ పేజీని వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వర్మ పుస్తకం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.