: డెస్క్ లో పని చేసే పాత్రికేయులకు కూడా ఆరోగ్య కార్డులు: ఏపీ మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో బుధవారం పాత్రికేయ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆరోగ్య కార్డుల అంశంపై చర్చించారు. డెస్క్ లో పని చేసే పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నట్లు సమాచారం. ఆశా ఆసుపత్రిలన్నింటిలో పాత్రికేయుల ఆరోగ్య కార్డులు పని చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కామినేని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని మంత్రి కామినేని గతంలో పేర్కొన్నారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలంటూ ఇటీవల పలు విజ్ఞప్తులు చేసేిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.