: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో మెట్రో సేవలు పునరుద్ధరణ
పారిస్ లో ఇటీవల ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించిన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో మెట్రో సేవలు పునరుద్ధరించారు. పాఠశాలలు కూడా పునః ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ నగరాన్ని పోలీసులు ఇంకా హైఅలర్ట్ లోనే ఉంచారు. పారిస్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కనీసం ఒకరు బ్రస్సెల్స్ లో ఉండి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాంతో పోలీసులు, ఇతర భద్రత సిబ్బంది నగరంలో ఇంకా మోహరించి అప్రమత్తంగా ఉన్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.