: ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా... స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన కోహ్లీ
మూడో టెస్టులో టీమిండియా పరుగులు రాబట్టేందుకు చెమటోడుస్తోంది. అతి కష్టం మీద పరుగులు రాబడుతోంది. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా నేటి ఉదయం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభారంభాన్ని ఇస్తారనుకున్న ఓపెనర్లు మురళీ విజయ్ (40), శిఖర్ ధావన్ (12)లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఛటేశ్వర్ పుజారా(21), అజింక్యా రెహానే (13)కూడా పెద్దగా రాణించలేకపోయారు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కోహ్లీ కూడా(22) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. కెప్టెన్ నిష్క్రమణతో టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (0)క్రీజులోకి వచ్చాడు. వృద్ధిమాన్ సాహా (4) అతడికి జతకలిశాడు. 40 ఓవర్లు ముగిసే సరికి సగం వికెట్లను పారేసుకున్న టీమిండియా 120 పరుగులు చేసింది.