: రైతులు, బలిదానాలు చేసుకున్న వారి తరఫున ప్రశ్నించడం తప్పా?: రేవంత్ రెడ్డి


తనపైన, ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ తాజాగా మండిపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. అటు చీప్ లిక్కర్ ను కూడా విమర్శించడం తప్పా? అని కేసీఆర్ ను అడిగారు. విపక్షాలపైన, మీడియాపైన నెపం నెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాలని సీఎం భావించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News