: స్వరం పెంచిన చంద్రబాబు... ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని వ్యాఖ్య


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీని కేంద్రం ఒడ్డున పడేయాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ మేరకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏపీ ఆర్థిక అవసరాల కోసం కేంద్రం రూ.700 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి విడుదలైన నిధులు రాష్ట్ర ఖజానాకు చేరిన మరునాడే ఈ విషయంపై చంద్రబాబు స్వరం పెంచడం గమనార్హం. వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరద సాయాన్ని కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక చిక్కుల్లో పడ్డ ఏపీకి విభజన చట్టం హామీల మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని తాను ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News