: ట్యునీషియా రాజధానిలో బాంబు పేలుళ్లు... 12 మంది మృతి


ఉత్తరాఫ్రికాలోని ట్యునీషియా రాజధాని టునిస్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ దేశ అధ్యక్షుడి భద్రత సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుని దుండగులు పేల్చేశారు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 30 మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన ట్యునీషియా ప్రభుత్వం... నెల రోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు బెజీకైడ్ తెలిపారు. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గత జూన్ నెలలో ఐఎస్ ఉగ్రవాదులు ట్యునీషియాలో దాడులు జరిపారు. అప్పుడు 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News