: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ప్రమాదం... వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి


హైదరాబాద్ రింగు రోడ్డుపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే నగరంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎన్.రాజేందర్ రెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి చనిపోయాడని సమాచారం. విశాల్ రెడ్డి కేఎంఐటీ కళాశాలలో చదువుతున్నాడు. కొడుకు మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. అటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

  • Loading...

More Telugu News