: రాహుల్ గాంధీ నా ప్రసంగాన్ని కాపీ కొట్టారు: స్మృతి ఇరానీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపణలు చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కాపీ కొట్టారని ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. అమేథీలో తను చేసిన ప్రసంగాలనే రాహుల్ ఎంచుకుని అదే శైలిలో ప్రసంగించారని అన్నారు. ఒకవేళ నిర్ధారణ చేసుకోవాలంటే అమేథీలో తను మాట్లాడిన వీడియోలను పరిశీలించాలన్నారు. తానొక నిర్దిష్ట శైలిలో మాట్లాడతానని, రాహుల్ కూడా తననే అనుకరించాడని ఎద్దేవా చేశారు. ఆయన తనను అనుకరించడం పొగడ్తగా తీసుకోనని, హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక రాహుల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. కాంగ్రెస్ నిరంతరం ఏడుస్తున్న బాధితుడి మాదిరిగా ఉందని స్మృతి విమర్శించారు.