: ఇక వేంపల్లె వంతు... కడప జిల్లాలో కుంగుతున్న భూమి, భయాందోళనల్లో ప్రజలు


కడప జిల్లాలో భూమి కుంగుతున్న ఘటనలు మరో ప్రాంతంలోనూ నమోదయ్యాయి. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం నాయినోరిపల్లెలో పలుచోట్ల భూమి కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే గ్రామంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నాలుగు రోజులు గడిచిందో, లేదో అదే జిల్లాలోని వేంపల్లె మండలంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మండలంలోని అశోక్ నగర్ కు చెందిన రైతు వెంకటశివ పొలంలో భూమి కుంగిపోయింది. దీంతో 20 అడుగుల లోతున ఏర్పడ్డ రెండు గోతులను చూసి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఘటన జరిగిన తీరుపై పరిశీలన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News