: అమీర్ ఖాన్ వ్యాఖ్యలు మమ్మల్ని చాలా బాధించాయి: వెంకయ్యనాయుడు


భారత్ లో మత అసహనం ఎక్కువైందంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తో, తెలిసో, తెలియకో ఆయన చేసిన వ్యాఖ్యలు తమను చాలా బాధించాయని, తీవ్ర ఇబ్బందికి గురిచేశాయని చెప్పారు. కొంతమంది ప్రజలు తప్పుదోవలోకి మళ్లించబడితే, మరికొంతమంది తప్పుదోవపడుతున్నారని అన్నారు. ఈ కేటగిరిలోకి వచ్చినవారిని నేరుగా తాను ప్రస్తావించనని పేర్కొన్నారు. కానీ ఇతర ఏ దేశాల్లో కూడా లేని చక్కటి పరిస్థితులు భారత్ లో ఉన్నాయని మాత్రం తాను చెప్పగలనని వెంకయ్య తెలిపారు. ఈ దేశంలో సహనం ఎక్కువ, భారత ప్రజలు సహనపరులని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ వచ్చాయని పేర్కొన్నారు. ఇక అమీర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించడం పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News