: టాస్ టీమిండియాదే!... ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా మరికాసేపట్లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. మహారాష్ట్ర నగరం నాగ్ పూర్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ టీమిండియావైపే మొగ్గింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్ ల స్థానంలో రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే 1-0 ఆధిక్యం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

  • Loading...

More Telugu News