: రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం... మాజీ డీజీపీ పేర్వారం మనవలు సహా ముగ్గురి దుర్మరణం


హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఉన్న పేర్వారం రాములు మనవలు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నేటి ఉదయం ఔటర్ రింగు రోడ్డుపై కోకాపేట వద్ద ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్ ను వేగంగా దూసుకువచ్చిన స్కోడా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పేర్వారం రాములు మనవలు (కూతురు కొడుకులు) అమిత్, వరుణ్ లతో పాటు జ్ఞానదేవ్ అక్కడికక్కడే చనిపోయారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వేగంగా స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కోకాపేట పరిధిలోని ఓ ఫాం హౌస్ నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News