: ఓరుగల్లు బరిలో ‘నోటా’ రికార్డు... 7,753 ఓట్లు పోల్!
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక పలు రికార్డులను నమోదు చేసింది. ఏకపక్షంగా సాగిన పోలింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దేశంలో నమోదైన రికార్డు మెజారిటీల టాప్ టెన్ జాబితాలోకీ దయాకర్ విజయం ఎక్కింది. అయితే ఉప ఎన్నికల బరిలోకి దిగిన ఏ ఒక్క అభ్యర్థి కూడా తమకు సమ్మతం కాదంటూ ఏకంగా 7,753 మంది ఓటర్లు తమ నిరసనను ‘నోటా’ రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా తెగులు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ‘నోటా’కు ఓట్లు పోల్ కావడం ఇదే ప్రథమమని ఎన్నికల అధికారులు నిన్న ప్రకటించారు.