: పెరూలో పెను భూకంపం... పొరుగు దేశాల్లోనూ ప్రకంపనలు
దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశం పెరూ భారీ భూకంపం తాకిడికి చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశంలోని పలు ప్రాంతాలను అరగంట పాటు వణికించింది. స్థానిక కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 5.45 గంటలకు సంభవించిన ఈ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలేమీ ఇప్పటిదాకా తెలియరాలేదు. భూఉపరితలానికి 602 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. పెరూలో సంభవించిన భూకంపం ఆ దేశం పొరుగు దేశాలు బ్రెజిల్, బొలివియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది.