: అది మా సంస్కారం!... లాలూ-కేజ్రీ ఆలింగనంపై తేజస్వీ రియాక్షన్


బీహార్ లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆత్మీయ స్వాగతం పలికారు. దగ్గరకు పిలుచుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అవినీతికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన లాలూను... అవినీతిని అంతమొందిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీ ఎలా ఆలింగనం చేసుకుంటారంటూ నెటిజన్లు సెటైర్లు విసరగా, పలు రాజకీయ పార్టీలతో పాటు అన్నా హజారే కూడా దీనిపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. అయితే లాలూ-కేజ్రీల ఆలింగనంపై బీహార్ డిప్యూటీ సీఎం, లాలూ పుత్రరత్నం తేజస్వీ తనదైన శైలిలో స్పందించారు. ‘‘అది మా సంస్కారం. దీనిపై ఎవరెన్ని మాటలు మాట్లాడినా మాకేం ఇబ్బంది లేదు. మా వేడుకకు వచ్చిన అతిథిని ఆలింగనం చేసుకోవడం మా సంప్రదాయం. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News