: సింగపూర్ ప్రధానికి మోదీ అరుదైన కానుక!


సింగపూర్ ప్రధాని హెచ్‌ ఈ లీ సీన్ లూంగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన కానుకను ఇచ్చారు. 1849 నాటి సింగపూర్ దీవుల మ్యాప్‌ పునర్‌ముద్రణను కానుకగా ఇచ్చారు. భారత జాతీయ ఆర్కైవ్స్ సంస్థ నుంచి సేకరించిన రేఖాచిత్రాల ఆధారంగా ఆనాటి మ్యాపును మళ్లీ యాథాతథంగా పునర్‌ముద్రించి లీ సీన్ లూంగ్‌కు అందజేశారు. 1842-45 మధ్యకాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా దీనిని రూపొందించారు. అప్పటి సింగపూర్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, దిగువప్రాంత జలాలను ఇందులో చూపించడం జరిగింది.

  • Loading...

More Telugu News